తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ బెల్లంకొండ సత్తయ్య 17వ వర్ధంతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ బెల్లంకొండ సత్తయ్య గారి 17వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న గారు మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,భూమికోసం, భుక్తి కోసం,పీడిత ప్రజల విముక్తి కోసం,జరిగినది, ఆ స్ఫూర్తితో నేటి యువత దానిని పునికి పుచ్చుకొని సమాజానికి ఉపయోగపడాలని కొనియాడారు,తెలంగాణను పట్టిపీడిస్తున్నటువంటి డ్రగ్స్ మరియుగంజాయి మాఫియాలో తాగుడుకు బానిసలై యువత చెడు మార్గం పడుతున్నారనిఆవేదన వ్యక్తం చేశారు, ఆ అమరవీరుల వారసత్వాన్ని కొనసాగించాలని చెడు మార్గంలో పడుతున్నటువంటి యువతను సన్మార్గంలో పెట్టాలని యువకులకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సత్తయ్య గారి పెద్ద కుమారుడు బెల్లంకొండ చక్రియ గారు స్థూపం వద్ద జెండా ఆవిష్కరించడం జరిగిన ది ఈ కార్యక్రమంలో సత్యయ్య గారికుమారులు రిటైర్డ్ టీచర్ బెల్లంకొండ పర్వతాలు గారు టిఆర్ఎస్ నాయకులు దండు మైసమ్మ మాజీ చైర్మన్ బెల్లంకొండ యాదగిరి గారు వారి యొక్క మనవలు బెల్లంకొండ పృథ్వి రాఖి రాజేష్ నవీన్ వారి కోడండ్లు ముని మనుమలు మనుమరాలు పాల్గొన్నారు