తెలంగాణ రైజింగ్.. కొత్త శిఖరాలకు రాష్ట్రం: సీఎం రేవంత్ రెడ్డి 

Aug 1, 2026 - 21:58
 0  0
తెలంగాణ రైజింగ్.. కొత్త శిఖరాలకు రాష్ట్రం: సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఆర్థికాభివృద్ధి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, గతేడాదితో పోలిస్తే రూ.38,900 పెరిగిందని ఆయన వెల్లడించారు. ఒకే ఏడాదిలో 10.23 శాతం వృద్ధి నమోదు చేయడం తెలంగాణ ఆర్థిక వృద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా మీడియాలో వార్తా కథనం సంబంధిత స్క్రీన్ షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారాయన. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని పేర్కొంటూ.. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కారణంగానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

పెట్టుబడులు, ఉపాధితో వేగంగా అభివృద్ధి..

విధానపరమైన పాలన, పారదర్శక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వల్ల తెలంగాణ అభివృద్ధి వేగంగా సాగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో నెలకొన్న నిరాశను తొలగించి ప్రజల్లో కొత్త ఆశావాదాన్ని నింపామని, తెలంగాణను దేశంలో అభివృద్ధికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో తెలంగాణ మరింత పురోగతి సాధిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333