తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లి,, మీటింగ్ లో సొసైటీ సిబ్బంది
చిన్నంబావి మండలం26 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త : కొప్పునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ సిబ్బంది మరియు డైరెక్టర్లు హైదరాబాద్ రాష్ట్ర సహకార సంఘం భవనం నందు వనపర్తి జిల్లా డి సి వో , ఎఫ్ పి ఓ లకు ఎంపికైన సొసైటీల చైర్మన్ లు, సీఈవోలు, డైరెక్టర్లు సిబ్బంది ఈ మీటింగ్ కు హాజరై రాష్ట్ర సహకార సంఘం ఎఫ్ పీ ఓ లను రైతుల సహకారంతో సభ్యత్వాలు చేయించి మీ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని ఇందుకు సంబంధించిన నిధులు 50% రైతులు పెట్టుబడి పెడితే మిగిలిన 50 శాతం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ పీ ఓ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలకు సంబంధించి మీ సొసైటీల పరిధిలో ఉన్నటువంటి రైతులకు అవగాహన కలిగించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి డి సి ఓ రాణి, కొప్పునూరు సీఈఓ నాగరాజు, డైరెక్టర్లు డేగ శేఖర్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ సిబ్బంది రవితేజ, సుమంత్ తదితరులు పాల్గొన్నారు