తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
తెలంగాణ వార్త, జూన్ 2 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎమ్మెల్యే గుర్తుకు చేశారు. తెలంగాణ అమర వీరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.