తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ కు

ఘనంగా జన్మదిన వేడుకలు

Feb 18, 2025 - 00:04
Feb 18, 2025 - 00:15
 0  4
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ కు

బాణాసంచా కాల్చి చాక్లెట్లు పంపిణీ

మాడుగులపల్లి17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గుండ్లపల్లి రామకృష్ణారెడ్డి (కిట్టు) అన్నారు. సోమవారం రోజు కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను మండలంలోని చెరువుపల్లి గ్రామ బొడ్రాయి వద్ద గ్రామ శాఖ గుండ్లపల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి కెసిఆర్ అని ఆయన పునుకోకపోతే రాష్ట్రం సిద్ధించేది కాదని 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. కేక్ కట్ చేసి భారీగా బాణ సంచాను కాల్చి బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.