తెలంగాణ ఉద్యమ కారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి 

Mar 3, 2025 - 20:43
Mar 4, 2025 - 00:53
 0  4
తెలంగాణ ఉద్యమ కారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి 
తెలంగాణ ఉద్యమ కారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి 
తెలంగాణ ఉద్యమ కారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి 
తెలంగాణ ఉద్యమ కారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి 

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ల ఉద్యమము. 

ఖమ్మం, 3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-  తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మయూరి సెంటర్ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు పోస్ట్ కార్డ్ మీద కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలైన ప్రతి ఉద్యమకరుడికి 250 చ: గ: స్థలాన్ని , 25వేల పెన్షన్ సౌకర్యం , గృహ నిర్మాణం కొరకు 10లక్షల రూపాయల నగదు లను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసి పోస్ట్ బాక్స్ లో వెయ్యడం జరిగింది . 33జిల్లాలో ఉన్న తెలంగాణ ఉద్యమ కారులు అందరూ తమ తమ జిల్లాల్లో ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమము ద్వారా పోస్ట్ కార్డ్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి మానిఫెస్టో లో గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకరులకి పైన తెల్పిన హామీలను 6 గ్యారంటీల క్స్కీమ్ లో పొందుపరచడం జరిగింది . కాబట్టి ఆ హామీలను అమలు చెయ్యాలని కోరుతూ పోస్ట్ కార్డ్ ఉద్యమము ప్రారంభం చేశారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా "కె.వి.కృష్ణారావు , తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య మరియు ఉద్యమకారులు గుంతేటి వీరభద్రమ్ , బచ్చల పద్మ చారి , పెళ్లూరి విజయ్ కుమార్ , రవిచంద్ర చౌహాన్ , షేక్ నాగుల్ మీరా , షేక్ అబ్బాస్ అలి , బురాన్ , ఆసిఫ్ , శ్రీనివాస్ నాయక్ , బాలిని భాస్కరరెడ్డి , దేవిరెడ్డి విజయ్ , భట్టు రాజేందర్ నాయక్ , బెల్లంకొండ నాగేశ్వరావు , రాము గౌడ్ , వల్లేపు సోమరాజు , యాకూబ్ , గాలి రాము గౌడ్ , ఆంకాలు , శ్రీనివాస్ విజయ్ , గద్దే వెంకట్రామయ్య , రెడ్డేబోయిన వరలక్ష్మి , కొరివి ధనలక్ష్మి , కామని అనంతలక్ష్మి , స్వరూప , ధనలక్ష్మి , జయ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333