తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్!
తెలంగాణ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్‌తో పాటు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి