తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరు: కేటీఆర్
తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరు: కేటీఆర్
తెలంగాణ : రేవంత్‌రెడ్డి మహిళలకు తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చేయలేదని, ప్రతి పంటకు బోనస్ ఇస్తానని ఇవ్వలేదన్నారు. రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని మోసం చేశారని, విద్య భరోసా కార్డు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు కాదు.. ముందు లక్షాధికారులను చేయండి చాలు అని ఎద్దేవా చేశారు.