- రైతు భరోసా పథకం సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి
ఇటిక్యాల మండలం వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్.
జోగులాంబ గద్వాల 26 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలం పరిధిలోని రైతులందరూ రైతు భరోసా పథకం వానాకాలం కు సంబంధించి మండలము లో మొత్తం 10295 మంది రైతులు ఉన్నారు. వీరిలో 122 మంది రైతులు అర్హత ఉన్నా బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వలేదు. మరియు జూన్ 15 వ తారీకు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు 239 మంది ఉన్నారు. కావున వీరు అందరూ వారి పట్టాదారు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు బుక్ వివరాలతో వారి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను జూలై 5:వ తారీకు లోపల సంప్రదించి, అవసరమైన పత్రాలు సమర్పించాలని మండల వ్యవసాయ శాఖఅధికారి రవికుమార్ మండల ప్రజలని కోరుతున్నారు.