తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలతోనే అభివృద్ధి సాధ్యం

Jul 10, 2026 - 05:46
Jul 10, 2026 - 12:49
 0  235
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలతోనే అభివృద్ధి సాధ్యం

తిరుమలగిరి 10 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా  శాసనసభ్యులు మందుల సామెల్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా పత్రిక విలేకరుల సమావేశంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రతిఫేదింటికి అందే విధంగా మందుల సామేలు కృషి చేస్తున్నారని విద్య వైద్యం పరంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని అదేవిధంగా తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం. 200 కోట్ల రూపాయలతో తొండలో గ్రామపంచాయతీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం

15 కోట్ల రూపాయలతో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఏకకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు  

ఈ కార్యక్రమంలో  టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్. మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్సోజు నరేష్. పిఎసిఎస్సి చైర్మన్ పాలెపు చంద్రశేఖర్. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు స్రవంతి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మిలాల్. ఐదవ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి. ఏడవ వాడు కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్.  9వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన మల్లయ్య. తిరుమలగిరి ఎక్స్ ఎంపీపీ జేరిపోతుల శోభ రాణి యాదగిరి. ప్రెస్ కన్వీనర్ కందుకూరు లక్ష్మయ్య. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరాల నరేష్.. జలాల్పురం సర్పంచ్ బెట్టం జ్ఞానేశ్వరి రాజు. వెలిశాల సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్. మర్రికుంట తండా సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్. కోక్యనాయక్ తండ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్. సిద్ధి సముద్రం సర్పంచ్ ధరావత్ సుజాత రాజశేఖర్, తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ యాదవ్, మామిడాల గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి లింగయ్య.  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాచేపల్లి వెంకన్న గారు. సంకేపల్లి దామోదర్ రెడ్డి. పత్తేపురం సుధాకర్. పేరాల బాలకృష్ణ.  బోల్ల వంశి . గుగులోతు భాస్కర్. గుగులోతు రాజు. దుప్పెల్లి అబ్బాస్. కృష్ణ నాయక్. జంపాల భిక్షం. పంగ బిక్షం. నరసింహ మాసoపెల్లి మోహన. గైగుల్ల కొండయ్య. తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి