తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న బండ్ల రాజశేఖర్ రెడ్డి...
ఈరోజు ఉదయం మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సీడ్ ఆర్గనైజర్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బండ్ల రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఏట నేను స్వామివారిని దర్శించుకుంటానని,భక్తుల కోరికలు తీర్చేవాడు ఈ స్వామి అని భక్తులందరూ చల్లగా ఉండాలని కోరుకున్నానని తెలియజేశారు. అలాగే వీరి వెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిందిభాయ్ ఆంజనేయులు, పరుశురాముడు, ఎలుక తిమ్మప్ప, నరసింహులు, జైపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.