తహసిల్దార్ కార్యాలయం వెనుక అగ్ని ప్రమాదం

May 21, 2026 - 23:16
 0  4
తహసిల్దార్ కార్యాలయం వెనుక అగ్ని ప్రమాదం

  తిరుమలగిరి  22 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రమాదవశాత్తు_పొలాలలో_మంటలు.

 సమాచారంపై అప్రమత్తమైన తిరుమలగిరి పోలీస్.

- ఫైర్ పోలీసుల సహకారంతో మంటలు అదుపులోకి తెచ్చిన పోలీస్.

 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న పొలాలలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఎండ తీవ్రతకు మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందడం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్స్ సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మునిసిపల్ సిబ్బంది పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి స్థానికులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పడంలో కృషి చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి