తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

Aug 6, 2026 - 19:41
Aug 6, 2026 - 21:12
 0  2
తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

  తిరుమలగిరి 07 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తల్లి పాలు వలన బిడ్డలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని డాక్టర్ సంజీవ నాయక్ అన్నారు. తిరుమలగిరి మండలం నందపురం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల విశిష్టతను వివరిస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా  వారు మాట్లాడుతూ పుట్టిన గంటలోపే బిడ్డకు ముర్రు పాలు పట్టించాలి. తల్లిపాలు బిడ్డ భవిష్యత్తుకు పునాది తల్లి పాలతో బిడ్డకు మేధస్సు ,ఎదుగుదల కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో" 9 వ వార్డు కౌన్సిలర్ మల్లయ్య ఏఎన్ఎం .సంధ్యరాణి. అంగన్వాడి టీచర్ . స్వప్న ఆశ .యశోద మరియు గ్రామ పెద్దలు గర్భిణీలు. బాలింతలు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి