హెచ్ పి వి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి
తిరుమలగిరి 07 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ స్వరూప రాణి అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూరిబా వసతి గృహంలో బాలికలకు టీకా కార్యక్రమము నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాల బాలికలకు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌కు వేల రూపాయలు ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కావునా అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కస్తూర్బాాబా గాంధీ ఉపాధ్యాయ బృందం ఏఎన్ఎం శ్రీలత ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు...