తల్లిదండ్రులు కన్నీరు పెడితే మంచిదా? కన్న కడుపుకు మానసిక క్షోభ కలిగించడం సిగ్గుచేటు
కన్న కొడుకులకే మమకారం, గౌరవం, జాలి లేకపోతే ఎలా? అందుకే నియంత్రణ కోసం చట్టాలు రావలసివచ్చింది* అంత వరకు వెళితే మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.*
***********
--వడ్డేపల్లి మల్లేశం 9014206412
---18....01....2025**--------*--*7
కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆధారమవుతున్నదనేటువంటి సదభిప్రాయం ఒకవైపు ఉంటే అంతకుమించిన స్థాయిలో కుటుంబ బంధాల్లో పగుళ్లు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నియమాలు నిబంధనలు ప్రేమ మమకారము, ఆత్మీయత సంబంధాలు, అనుబంధాలు, వావి వరుసలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే కూడా స్వార్థం అహంకారం ఆధిపత్యం విర్రవీగేతనం డబ్బు పైన మోజు తమను తామే చూసుకుని మురిసిపోవడం వంటి దుర్మార్గపు లక్షణాల వలన సమాజం నిలువునా చీ లిపోతున్నది.అందులో కుటుంబాలు కూడా అంతే స్థాయిలో భగ్నమవుతున్నాయి.
ఎవరింట చూసినా ఘర్షణలు, నోటి మాటకు నోచుకోకపోవడం, సంబంధాలు లేకపోవడం, నిరంతరము పంచాయితీలు, కోర్థుల చుట్టూ తిరగడం, కక్షలు కార్పన్యాలు పెంచుకొని హత్య ప్రయత్నాల వరకు వెళుతున్నటువంటి ఈ వాతావరణాన్ని నిలువరించలేకపోవడం విషాదకరం. ప్రస్తుతం మనం కుటుంబ వ్యవస్థలో కన్న తల్లిదండ్రులను కొడుకులు కోడండ్లు కుటుంబ సభ్యులు వృద్ధాప్యంలో పోషించకపోవడమే కాకుండ ఎంత వివక్షతకు గురి చేస్తున్నారు అనే అంశానికి పరిమితమై ముఖ్యంగా కన్న కొడుకులే తల్లిదండ్రులను హింసించేటువంటి అంశం పైన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కన్న కొడుకుల లో రావలసినటువంటి పరివర్తన పశ్చాత్తాపానికి మనమందరం ప్రయత్నించాలని ఈ వ్యాసం ద్వారా మీ ముందుకు రావడం జరుగుతున్నది.
కనికరం లేని కన్నా కొడుకు లారా! మనుషులుగా మారండి :-
*************
పదిమంది కొడుకులను కనీ పెంచి పెద్ద చేసి తీర్చిదిద్ది వాళ్ల యోగ క్షేమాలు చూసినటువంటి తల్లి అందుకు సహకరించినటువంటి తండ్రిని పదిమంది కలిసి వృద్ధాప్య దశలో కనీసం గానైనా పలకరించకపోవడం పోషించడానికి మనసు రాక ఇంటి నుండి బహిష్కరించడం అవమానించడం దూషించడం దుర్భాషలాడడం చేయి చేసుకోవడం వంటి సంఘటనలు నిత్యం అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే అందరూ ఇలాగే ఉంటారని కాదు కానీ ఆ రకమైన మూర్ఖపు ప్రవర్తన కలిగిన వారి గురించే మన అందరి ఆవేదన. మానవత్వాన్ని అమ్ముకున్న వ్యక్తులే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడతారు మనసులేని బండరాయి లాంటి వీరిలో పశ్చాత్తాపము పరివర్తన తీసుకురావడం మనందరి బాధ్యత. కుటుంబ బంధాలు బలంగా ఉంటే, వృద్ధులైన తల్లిదండ్రులు పెద్దరికo తోడుంటే ఆ కుటుంబాలు గౌరవప్రదంగా ఉంటాయి. గతంలో అలాగే కొనసాగినాయి కూడా. ప్రస్తుతం పెద్దమనుషులకు గౌరవం లేకపోవడం కుటుంబాలలో ప్రాధాన్యత ఇవ్వకపోగా వారిని వెలివేసినట్లుగా పాత సామాన్లు లాగా పక్కనపెట్టి దురభిప్రాయానికి ఈ సమాజం పూనుకోవడం నిజంగా విషాదకరం. ఇంకా కొన్ని ఏళ్లలో సాంప్రదాయాలు ఆచారాలు నీతి నిజాయితీ పెద్దరికం కలిగినటువంటి పెద్దమనుషుల కాలం అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి మధ్య వయస్కులు గాని యువత గాని అనాగరిక అకృత్యాలు అమానవీయ పరిస్థితుల మధ్యన ఎదిగిన వాళ్ళు కనుక సమాజాన్ని వాళ్లు ఇ లాగే కొనసాగించే ప్రమాదం ఉంది. వారసత్వంగా రావలసినటువంటి నీతి నిజాయితీ మానవ విలువలు ఆగిపోతే బ్రేక్ అయితే రాబోయే తరం వికృత చేష్టలకు నిలయమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం కొంతవరకు దాని రుచిని చూస్తూనే ఉన్నాం.
తల్లిదండ్రులు కన్నీరు పెడితే ఆ ఇంటికి క్షేమం కాదు భాధ పెట్టినవాళ్లు కన్నెపిల్లలు ఎలా అవుతారు ఆలోచించుకోవాలి. ఎక్కడో పుట్టి ఇంటికి కోడలుగా వచ్చినటువంటి వ్యక్తి కి కుటుంబ పరిస్థితులు చరిత్ర గతంలో వాళ్ళు చేసిన కృషి తెలియకపోవచ్చు. ఆ క్రమంలో కొన్ని అసంబంధం నిర్ణయాలు, అప్పుడు మాటలు మాట్లాడే అవకాశం ఉంటే ఉండవచ్చు కానీ తల్లి కడుపులో జన్మించిన నుండి ఇంత వయసు వచ్చేవరకు ఇంటి వాతావరణం తల్లిదండ్రుల ప్రేమానురాగాలు బాధ్యతలు గుర్తుంచి కూడా కొడుకు వారి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయకపోవడం దుర్భాషలాడి దండించడం వరకు వెళితే ఆ జన్మకు సార్థకత ఎలా ఉంటుంది? సమాజం వెలివేసిన, నిందించిన, ఇది తప్పు అని హెచ్చరించిన అలాంటి మూర్ఖులు మారనప్పుడే కదా శిక్షలు చట్టాలు రావాల్సి వచ్చింది. కొందరు ఇంటి నుంచి బయటికి పంపించి బాధ్యతలను తప్పుకోవడం కోసం ఎక్కడో విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉంటే మరి కొందరు బాధ్యత నుండి తప్పుకోవడానికి అనాధాశ్రమాలలో వేసి చేతులు దులుపుకొని సంతోష పడుతున్నారు. అలాంటి పరిస్థితులు తమ దాకా వస్తే కానీ తెలియదు కదా! మరికొన్ని చోట్ల కోడళ్ళు ఇది సరైన ప్రవర్తన కాదు అని భర్తను హెచ్చరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. " నావల్ల నీవు మారినావని నీ తల్లిదండ్రుల పట్ల కోపంగా ఉన్నావని అనుకునే ప్రమాదం ఉంటుంది కదా!" అని హెచ్చరించిన కోడళ్లను కూడా మనం చూడవచ్చు. కొడుకుల వరకు పరిమితమై మాట్లాడుతున్న ఈ సందర్భంలో తల్లిదండ్రులని మనుషులుగా చూడనటువంటి ఆ మూర్ఖుల కళ్ళు తెరిపించాల్సిందే బహిరంగంగా శిక్ష విధించవలసిందే. సమాజంలో బహిష్కరణకు గురి చేయవలసిందె! అయితే కావాల్సింది ఇరుగుపొరుగు వారిలో సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తుల్లో ధైర్యం సామాజిక బాధ్యత. ఇదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోను చట్టము రెవిన్యూ వ్యవస్థ తమకు ఉన్నటువంటి అధికారము ఉపయోగించి కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. "తల్లిదండ్రులు తమకు ఉన్నటువంటి యావదాస్తిని కొడుకులకు బిడ్డలకు అంకితం చేసి పిల్లలే మా ఆస్తులు అని భావించి ఎ లాంటి స్వార్థానికి ఒ డి కట్టకుండా ఉన్న తరుణంలో మీకు ఇల్లు లేదు అని గెంటి వేసిన సందర్భాలలో వాళ్ల ఇండ్లను ఆస్తులను జప్తు చేయడము, జరిమానా విధించడం, జైలు శిక్ష విధించడంతో పాటు ఉన్నటువంటి చట్టాలను ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి కన్న కొడుకులు తమ మూర్ఖత్వానికి స్వస్తి పలికి మానవతా విలువలను కనీసం గానైనా ప్రదర్శించే అవకాశం ఉంటుంది." తా ము వృద్ధులమైతె తమ పరిస్థితి కూడా ఇంతే కదా అలాంటప్పుడు మనము ఆదర్శంగా ఉండి మన పిల్లలను హెచ్చరించే స్థాయిలో ప్రవర్తిస్తే మంచిది అనే సోయి కొడుకులకు లేక తల్లిదండ్రులతో నిర్లజ్జగా వ్యవహరించడాన్ని సమాజం ఖండించాలి. ఎక్కడికక్కడ చర్చలు జరగాలి కొంతమంది అయినా సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకొని ఇలాంటి సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి. అలాంటి కృషి కూడా సాగుతున్నది కనుకనే ఇంకా మానవత్వం పూర్తిగా అడుగంటి పోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకురావడం అభినందనీయం వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా చట్టాల పైన ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇలాంటి మూర్ఖులకు గుణపాటాన్ని కలిగిస్తే బాగుంటుంది. సమాజం విధించే శిక్ష మరింత పదునుగా ఉంటుందని రుచి చూపించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )