తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులను సస్పెండ్ చేయాలి. 

 ప్రైవేట్  భూముల ఇండ్ల ఫ్లాట్లను  నిషేధిత భూములు గా చూపడం సరికాదు. 

Dec 19, 2024 - 19:14
Dec 20, 2024 - 12:27
 0  7

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.(సూర్యాపేట, టౌన్ డిసెంబర్ 19) ప్రైవేట్ వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం వెంచర్ లలో కొనుగులు చేసిన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలనీ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వం ను కోరారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం లో నిషేధిత భూముల జాబితా ను సరిచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన విలేకరులతో మాట్లాడుతూ 30ఏళ్ల క్రితం సూర్యాపేట పట్టణం లోని ఈనాడు ఆఫీస్, కొత్త బస్టాండ్, ఎస్వి కళాశాల సమీపంలో చేసిన వెంచర్ లలో ఎంతో మంది పేదలు భూములు కొన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం ఎల్ ఆర్ ఎస్ చేసుకోవాలని సూచిస్తే ప్రజలు ప్రభుత్వ కార్యాలయం కు వెళ్తే వారి భూములు నిషేధిత భూములు గా ఆన్లైన్ లో చూపడం తో ఆందోళన కు గురౌతున్నారని చెప్పారు. ఈ విషయం పై అధికారుల ను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని పై అధికారుల ను కలవాలని చెప్పడం తో సామాన్యులు తీవ్ర మనోవేదన కు గురౌతున్నారని అన్నారు. సొంత డబ్బులు, అప్పు చేసి తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్ కోసం భూములను కొంటె ఇప్పుడు తమ భూములు నిషేధిత భూములు గా ఆన్లైన్లో చూపడం తో ఎంతో మంది కార్యాలయం ల చుట్టూ తిరుగుతున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారిచేసి ఆన్లైన్లో జరిగిన పొరపాట్ల ను సవరించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్ ఆర్ ఎస్ కోసం ఆఫీస్ లో సిబ్బంది ని పెంచాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రయివేట్ భూముల ను అధికారులు ప్రభుత్వం భూములు గా చూపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలొ ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్  జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నె శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, దంతల రాంబాబు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి ఆకుల మారయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పాష నీలయ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333