తక్కువ నీటితో పండే పంటల వైపు ముగ్గు చూపాలి.

ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ కేశవరావు.

Aug 8, 2026 - 01:25
Aug 8, 2026 - 01:56
 0  3
తక్కువ నీటితో పండే పంటల వైపు ముగ్గు చూపాలి.

జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎల్నినో ప్రభావము, వర్షాభావ పరిస్థితుల వలన  రానున్న రోజులలో వర్షాలు తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో పండే  ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని.ఇరిగేషన్ శాఖ యస్.ఇ. కేశవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు కు వరద రావడము వలన చెరువులు నింపుకోవడానికి మరియు త్రాగునీటి అవసరాలకు, కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగినదని, ఈ నీటి విడుదల వరద ప్రవాహము తగ్గిన తర్వాత నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి పరిస్తితులలో వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షాలు తగ్గి వరద వచ్చే అవకాశం లేదు.  కావున రైతులు నీటి విడుదల   వ్యవసాయము కొరకు కాదని గుర్తించి కాల్వల ద్వారా పూర్తి పంటకాలానికి నీటి విడుదల ఉంటుందని భావించ వద్దని సూచించారు. కేవలం నీటి విడుదల పరిమిత సమయం మాత్రమేనని, వరద తగ్గిన వెంటనే నీటి విడుదల  ఆపివేయబడునని గద్వాల జిల్లాలోని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State