ఢిల్లీలో సింగారం రమేష్ కు ఘన సన్మానం

Mar 28, 2025 - 18:51
 0  145
ఢిల్లీలో సింగారం రమేష్ కు ఘన సన్మానం

గుండాల 28 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- గుండాల మండల వాసి ప్రముఖ ధూమ్ దాం కళాకారుడు, కవి,గాయకుడు సింగారం రమేష్ కు ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది.ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ జేరిపోతుల పరశురాం ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బుధవారం రోజున తెలంగాణ నుంచి వచ్చిన సుమారు 100 మంది కళాకారులతో ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు తెలుగు రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించిన మేధావి అంబేద్కర్ అని తెలిపారు. ఆనాడు పరాయి పాలనలో ఉన్న మన దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులని సరిదిద్ది, దేశంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద తప్పకుండా ముద్రించాలని అన్నారు. అనంతరం ధూమ్ దాంలో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటెల రాజేందర్, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, అప్పలనాయుడు, ప్రసిద్ధ ధూంధాం Yrకళాకారులు , కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్ట గళ్ళ సంజీవ ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న వొల్లాల వాణి, చెరుకు మల్లిక, ముక్కెర సంపత్, రామంచ భరత్, రేలారే గంగ తదితర 100 మంది కళాకారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333