డ్రమ్ములలో డీజిల్ తీసుకుపోతుండ్రు
పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు -
నిల్వలు ఉన్నా చోటకు జనం పరుగులు...
పెద్ద డబ్బాల్లో డీజిల్ తీసుకెళుతున్న జనం...
తిరుమలగిరి 30 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి! చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. పనులన్నీ మానుకుని ఇంధనం కోసం బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. గంటల తరబడి అక్కడే పడిగాపులు కాసేలా చేస్తోంది. అయినా దొరుకుతుందనే నమ్మకం లేదు. స్టాక్ అయిపోయిందని నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది హతాశులై ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత అధికమైంది. చాలా మంది అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయడంతో నిల్వల తగ్గిపోతున్నాయి. ఇండియన్ ఆయిల్ బంక్ లో పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ముల్లో డీజిల్ కొని తీసుకెళ్తున్నారు. దీంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ ఉన్నచోట జనం బారులు తీరుతున్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా సాగులో ఏరియేటర్లకు డీజిల్ కావాలంటూ రైతులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు...