డిమాండ్స్ డే సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ కి వినతి

Jul 10, 2024 - 19:46
Jul 10, 2024 - 19:47
 0  2
డిమాండ్స్ డే సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ కి వినతి

మునగాల 10 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- - డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహశీల్దారు అంజనేయులకు వినతి పత్రం ఇస్తున్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం వివిధ రంగాల కార్మిక నాయకులు.

 బుధవారం ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి గత పదేళ్లు గా సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు పూనుకుంటుందని ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. కార్మికులకు నష్టదాయకం చేసి ఈ లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆశ, మధ్యాహ్నం భోజనం, ఐకెపి విఓఏ, అంగన్ వాడి వైద్య ఆరోగ్య రంగాలతో పాటు వివిధ స్కీం లలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల గడువు ముగిసిన వెల్ఫేర్ బోర్డు కార్డులను రెన్యువల్ చేయాలి కొత్తవారిని బోర్డులో నమోదు చేసుకోవాలి హమాలి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేయాలి హిట్ అండ్ రన్ రద్దు చేయాలని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ అందరిని హరాతలను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని. ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలి కనీస వేతన అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసినారు.

  ఈ ధర్నాకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు, రైతు సంఘం మండల నాయకులు వెంకటాద్రి మద్దతు తెలిపినారు 

 ఈ కార్యక్రమంలో కిన్నెర వెంకన్న,ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు వాణి, అనిత, వనిజ, మధ్యాహ్న భోజన కార్మికులు బి మంగమ్మ,జి ధనమ్మ,ఎస్ లింగమ్మ, ఐకెపి విఓఏ ఉమారాణి,సామ్రాజ్యం, చిన్న సైదులు, లక్ష్మయ్య,వెంకటేశ్వర్లు, వర్కర్స్, గురువమ్మ, ఉదయమ్మ, బిల్డింగ్ వర్కర్స్ షేక్ దస్తగిరి, నాగరాజు, ఆంజనేయులు, రమేష్, జిపి వర్కర్స్ ఎల్ నాగరాజు, వి వెంకటేశ్వర్లు, ఎం వెంకన్న,రామారావు, గోపిరెడ్డి, వస్త్రం, సాగర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State