డిఫెన్స్ గా నిదానంతో వాహనాలు నడపాలి
ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల విధి.. సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్
సూర్యాపేట 28 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈరోజున సూర్యాపేట పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ డిపో నందు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎస్పి ప్రసన్నకుమార్ హాజరై వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్ల పై ఉన్నదని డిఎస్పి తెలిపారు. నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు, ఆర్టీసీ సిబ్బందితో వాహనాలను జాగ్రత్తగా నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వాహనాలు నిదానంగా నడపాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదని ఇందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. కార్యక్రమం నందు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్టీసి సిబ్బంది ఉన్నారు.