డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో.. ఉజ్వల భవిష్యత్తు
డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్స్ శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణీ......
ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య....జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యపేట, 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ నైపుణ్యంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో ఈఎంసీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 9,10 వ తరగతి తరగతి విద్యార్థుల కోసం ఈనెల 15 నుండి 20వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ కోర్సు సిలబస్ పుస్తకాలతో కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జిపిటి, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటింగ్, విషయాలను విద్యార్థులు నేర్చుకోవడం వలన సబ్జెక్టు విషయాలకు అన్వయించుకుని, సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చునని పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులను ప్రత్యేకంగా కంప్యూటర్ విభాగంనకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులతో పరిశీలించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసినారు. పాఠశాలలో జరుగుతున్న నూతన అడ్మిషన్ల డెస్క్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, తాసిల్దార్ సంతోష్ కిరణ్ , ఎం ఈ ఓ సలీం షరీఫ్,పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. మార్కండేయ, డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణ మాస్టర్స్ ధీరజ్, రవితేజ, నాని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.