టెట్ ఫీజును పెంచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

Apr 17, 2025 - 19:05
Apr 17, 2025 - 19:07
 0  9

తక్షణమే TET ఫీజు తగ్గించాలి అని నిరసన

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. తక్షణమే టెట్ ఫీజును తగ్గించాలని గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయం దగ్గర నిరుద్యోగులతో కలిసి నిరసన తెలిపిన BRSV రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య  ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.. ఎన్నికలు హామీలో భాగంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి మేము గద్దెనెక్కితే తక్షణమే మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)పరీక్షకు ఫీజు లేకుండా ఉచితంగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటామని మాట ఇచ్చి ఈనాడు మోసం చేస్తూ పేపర్ కు 750/-  రెండు పేపర్లు కలిపి 1000/- రూపాయలు టెట్ ఫీజు తీసుకోవడం ఇది నిట్టనిలుగా నిరుద్యోగులను ముంచడమే.   ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నిండా ముంచి, సంవత్సరంకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం.  జాబ్ క్యాలెండర్ ద్వారా మీ జీవితాలను వెలుగులు నింపుతామని, ఈరోజు దాన్ని జోక్ క్యాలెండర్ గా మార్చి నిరుద్యోగుల యొక్క జీవితాలను చీకటిగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 16 నెలల్లో 57 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. వీటిలో కాంగ్రెస్ సర్కార్ కొత్తగా భర్తీ చేసింది 6 ఉద్యోగాలే! గ్రూప్-1,  డీఎస్సీలు కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో విడుదలైనవే. పాత వాటిని రద్దుచేసి కొన్ని పోస్టు కలిపి విడుదల చేసినవే.  కాంగ్రెస్ భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నా ఉద్యోగాలన్నీ గతంలో కేసీఆర్  ఆయంలో 2022, 2023లో నోటిఫికేషన్లు ఇచ్చినవి.  కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్డప్ ఇస్తున్నది. జెఎల్ నోటిఫికేషన్ దాదాపు 13 ఏళ్ల తర్వాత కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. ఇటీవల ఫలితాలు ప్రకటించిన గ్రూప్ 4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే నిర్వహించారు. గ్రూప్-2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు కూడా బిఆర్ఎస్ సర్కారే విడుదల చేసింది వాటిలో కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా ఇటీవల న్యాయస్థానాల్లో చిక్కుముడులు విడటంతో ఇప్పుడు నియమక పత్రాలు ఇచ్చి తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కార్కు చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. * ఒక నోటిఫికేషన్ ఇవ్వని జాబ్ క్యాలెండర్ ఇదే. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎంతో అట్టహాసంగా ప్రకటించిన 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వని జాబ్ క్యాలెండర్ గా రికార్డు ఎక్కింది. అక్టోబర్లో గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్ట్ ల భర్తీ నోటిఫికేషన్లు జార్ చేయాల్సి ఉండగా అది జాడలేదు.  జాబ్ క్యాలెండర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో కేవలం ప్రకటన మాత్రమే చేసి చేతులు దులుపుకోవడం అంటే నిరుద్యోగులను నిండా ముచ్చటమే అని అన్నారు.  కచ్చితంగా భవిష్యత్తులో మీరు నిరుద్యోగులకు ఏవైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చ వరకు టిఆర్ఎస్వి పోరాటం చేస్తుందని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో మహేష్, మాధవ్, నరేష్, చిన్నారి, చక్రవర్తి, మరియు టెట్ కు గ్రంధాలయం లో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333