జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ సర్వీస్ పై సమీక్ష సమావేశం
జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 108 ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో 108 సేవలపై సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, 108 అంబులెన్సులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరూ 108 సేవలను వినియోగించుకోవాలని, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ క్షతగాత్రులను అత్యంత బాధ్యతతో తరలించాలని సూచించారు. అలాగే, 102 హెల్ప్‌లైన్ సేవలను మరింతగా ప్రజల్లో విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వారిలో గద్వాల్ జిల్లా కోఆర్డినేటర్ బి. రత్నమయ్య నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ రాఘవేంద్ర , మహబూబ్‌నగర్ జిల్లా 108 కోఆర్డినేటర్ ఉదయ వనపర్తి 102 జిల్లా కోఆర్డినేటర్ మహబూబ్ విశేషంగా పాల్గొన్నారు.