జిల్లా యువజన అభ్యర్థి  ఆధ్వర్యంలో ఏఎంసి వైస్ చైర్మన్ కి సన్మానం..

Nov 19, 2024 - 17:23
Nov 19, 2024 - 17:24
 0  6
జిల్లా యువజన అభ్యర్థి  ఆధ్వర్యంలో ఏఎంసి వైస్ చైర్మన్ కి సన్మానం..

తెలంగాణ వార్త దంతాలపల్లి:- మహబూబాబాద్ జిల్లా యువజన అభ్యర్థిగా బరిలో ఉన్న దంతాలపల్లి మండలానికి చెందిన ఆవుల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక శ్రీ బాలాజీ గార్డెన్ లో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమితులైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ బట్టు నాయక్ కి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అవుల సురేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎలాంటి అవకాశం వచ్చినా ఎన్నికల బరిలో ఉంటానని, ప్రజాసేవే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.అనంతరం వరంగల్ లో జరిగే మహిళ ఆశీర్వాద సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు.ఈ కార్యక్రమంలో మండల, జిల్లా నాయకులు కొమ్మినేని సతీష్, లింగారెడ్డి, పోనోటి బాలాజీ, తండ చిన్న రాములు, హరికృష్ణ, వెంకట్ రెడ్డి, వాసు, యాకన్న తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333