జలాల్ పురం లో విద్యార్థులకు అవగాహన

Apr 21, 2026 - 03:45
Apr 21, 2026 - 07:12
 0  46
జలాల్ పురం లో విద్యార్థులకు  అవగాహన

తిరుమలగిరి 21 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 'బడి బాట' కార్యక్రమంలో భాగంగా నేడు విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జలాల్‌పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, రాఘవపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.ప్రాథమిక పాఠశాలలోని ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులతో సమావేశమై, వారిని సాదరంగా పలకరించి పరిచయం చేసుకున్నారు. అనంతరం జలాల్‌పురం ఉన్నత పాఠశాలలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను విద్యార్థులకు వివరించారు.ఉన్నత చదువుల కోసం జలాల్‌పురం పాఠశాల ఒక ఉత్తమ వేదిక అని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి