జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన ""ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ తాతయ్య గారు
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు
విజయవాడలో జల వనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో రైతు నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హాయంలో నిలుపుదల చేసిన ముక్త్యాల ఎత్తి పోతల పథకం తిరిగి పునః ప్రారంభించాలని, కంచల- వేదాద్రి ఎత్తిపోతల పథకం మేజర్ రిపేర్లు వెంటనే చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని, పోలంపల్లి డ్యామ్ ప్రాజెక్ట్ క్రొత్త డిజైన్ సక్రమంగా లేనందున పాత డిజైన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేసి రైతులకు మేలు చేసే విధంగా వెంటనే పనులు చేపట్టాలని, ఈ మూడు పథకాలకు సంబంధించి వెంటనే నిధులు మంజూరు చేయాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు కోరారు._
ఈ కార్యక్రమంలో వేగినేటి గోపాలకృష్ణమూర్తి, పొన్నం నరసింహారావు, విశ్వనాథం, బాలాజీ, కృష్ణారావులు పాల్గొన్నారు.