చౌళ్ళగూడెంలో ముందస్తు బడిబాట కార్యక్రమం

Apr 6, 2026 - 14:02
Apr 6, 2026 - 15:40
 0  55
చౌళ్ళగూడెంలో ముందస్తు బడిబాట కార్యక్రమం

అడ్డగూడూరు 6 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి,చౌళ్ళగూడెంలో ప్రధానోపాధ్యాయులు పి జానయ్య వెల్దేవి గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..గ్రామంలోని 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని అన్నారు. విద్యతోపాటు యూనిఫామ్, తెలుగు ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు, షూస్,టై, బెల్ట్, ఉదయం పూట రాగి జావా,సన్న బియ్యం మధ్యాహ్నం భోజనం, అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కడెం సోమయ్య, కడెం అమృతమ్మ, కడెం కలమ్మ, కడెం అంబిక, చిలుకూరి వెంకన్న, గజ్జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333