చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఆరు నెలల జైలు శిక్ష.

Aug 18, 2026 - 21:45
 0  1

కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు.

కోదాడ, ఆగస్టు18 : రూ.13 లక్షల చెక్ బౌన్స్ కేసులో నిందితురాలైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుంకర (గోపతి) నాగేంద్రమ్మకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాల ప్రకారం కోదాడ పట్టణానికి చెందిన ఒక్కవంతుల మట్టపల్లి రావు వద్ద నాగేంద్రమ్మ తన కుటుంబ అవసరాల నిమిత్తం  రూ.13,000,000 అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చే క్రమంలో  చెక్ ను ఇచ్చారు. ఆ చెక్‌ను బ్యాంకులో జమ చేయగా ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. బాధితుడు  న్యాయవాది బెల్లంకొండ గోవర్ధన్ ద్వారా నోటీసు పంపినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నాగేంద్రమ్మకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. బాకీ మొత్తాన్ని చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారుని తరఫున న్యాయవాది బెల్లంకొండ గోవర్ధన్ వాదనలు వినిపించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333