చిన్న తాండ్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాళం 

Feb 18, 2026 - 16:39
 0  2
చిన్న తాండ్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాళం 

 జోగులాంబ గద్వాల 18 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ మండల పరిధిలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కొత్తగా నిర్మించిన భవనంలోని విద్యార్థులను కాంట్రాక్టర్, బయటకు పంపించి తాళం వేశారు ఈ విషయమై కాంట్రాక్టర్ రమేష్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా  నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది,ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు చిన్న తాండ్రపాడు గ్రామంలో  కొత్తగా స్కూల్ భవనం నిర్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు  బిల్లులు మంజూరు చేయకుండా అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దానికి సంబంధించిన బిల్లు ఏఈ అజాం బిల్లును ఆపడం జరిగిందని ఆవేదన చెందారు. భవనం కోసం తెచ్చిన  అమౌంట్ కు వడ్డీలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నాను ఏ ఈ డి ఇ లు మాత్రం అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అంటూ కాలయాపన చేస్తున్నారు దానికి సంబంధించిన బిల్లులు ఇస్తేనే తాళం తీస్తానంటూ పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333