చిన్నంబావి మాజీ జెడ్పిటిసి వెంకట్ రమణమ్మ, చిన్నారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు

కొల్లాపూర్ లో మొదలైన మార్పు.
ఆరు గ్యారెంటి అనే గారడీలో మోసపోయాం..
16 నెలల లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్..
చిన్నంబావి మండల మాజీ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ ఎస్ పార్టీ లో మాజీ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరారు.
అప్పుడు 420 హామీలను నమ్మి మోసపోయా ..అన్న లాంటి హర్షన్న ను వదిలి వెళ్లానని నేడు తిరిగిరావడం చాలా సంతోషంగా ఉంది అని ఈదన్న యాదవ్ అన్నారు.
బీఆర్ ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ ఉన్నపుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు ,రైతుబంధు,రైతుబీమా అందిచామని అన్నారు.
గతం లో చిన్నంబావి మండలం అభిరుద్ది చెందాలని దేవరకొండ నుంచి వయా చిన్నంబావి అలంపూర్ వరకు NH కు ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం నికి చిత్త శుద్ధి లేదు అన్నారు
రైతులు,ప్రజలకు అంతరాయం లేకుండా కరెంట్ వచ్చింది అంటే అది బీఆర్ ఎస్ ప్రభుత్వం లోనే ,ఇపుడు గాలి వస్తే కరెంట్ కట్ పోతుంది అని అన్నారు
ఈ సమావేశంలో వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,తదితరులు ఉన్నారు.