మందు బాబులకు నిలయమైన అయిజ ఆసుపత్రి
జోగులాంబ గద్వాల 27 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ పట్టణంలో ప్రభుత్వ 30 పడగల ఆసుపత్రిని బిజెపి జిల్లా అధ్యక్షులు S. రామచంద్ర రెడ్డి సందర్శించడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... 30 పడగల ఆసుపత్రి ఒక సంవత్సరం కాలం నుంచి ఎలాంటి పనులు పూర్తి చేయడం లేదు అయిజ పట్టణానికి అనునిత్యం 50 నుంచి 60 గ్రామాల నుంచి పేద ప్రజలు రోగాలను మంచిగా చేసుకోవడానికి వస్తూ ఉంటారు రోజు 250 కి పైగా పేషెంట్స్ ఈ అయిజ ఆసుపత్రికి వస్తున్నారు.
అయితే జోగులాంబ గద్వాల జిల్లా తర్వాత రెండవ పెద్ద పట్టణం అయిజ కానీ పేషెంట్లకు సరిపడా కనీసం మందులు లేవని బయట తెచ్చుకోవాలని అక్కడున్న సిబ్బంది చెప్పడం జరుగుతుంది మరి ఈ 30 పడకల ఆసుపత్రి పూర్తి అయితే 15 మంది స్పెషలిస్టు డాక్టర్లు వస్తారు ఓపి రాయడానికి పేపర్లు కూడా లేని దుర్భర పరిస్థితి అయిజ ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల రక్త పరీక్షలు బయట ప్రైవేటు సెంటర్లకు పంపిస్తున్నారు రాత్రి సమయాలలో ఇక్కడ వచ్చిన పేషెంట్లకు బాలింతలకు సెక్యూరిటీ గాడు లేకపోవడం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు స్త్రీలు అదేవిధంగా కరెంటు లేకపోవడం ఆసుపత్రి చుట్టూ ముళ్ల కంపలు రోజుకు 250 కి పైగా వచ్చే పేషెంట్లకు బాలింతలకు కనీసం మంచినీటి సౌకర్యాలు లేకపోవడం శోచనీయం ప్రజా ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తీసుకొని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు హామీలు తప్ప అమలు చేయడం లేదు ఈ 30 పడగల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలి లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల అధ్యక్షులు నరసింహ శెట్టి గోపాలకృష్ణ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ స్వామి, భగత్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, వీరయ్య ఆచారి, రాజశేఖర్, బ్రహ్మయ్య చారి, శేఖర్, వెంకటాపురం మహేష్, పులికల్ రాజశేఖర్, గోపాల్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది