చదువుతోనే ముందుకు సాగాలి ఎస్సై వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 23 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– చదువు అనేది ఒక జ్ఞానం చదువు విద్యార్థులకు ఉంటే భవిష్యత్ చదువు లేకుంటే ఇప్పటి తరం భవిష్యత్తుకు అంతరాయం విద్యార్థి చదువుకో..విద్యార్థి మేలుకో.. నేటి బాలలే రేపటి పౌరులు.. తల్లిదండ్రులను గుర్తుపెట్టుకో.. డిగ్రీలను చేత పట్టుకో.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా మంగళవారం రోజు మంగమ్మగూడెం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం పోలీసులు బాలికలకు అవగాహన కార్యక్రమం కల్పించారు. మాదకద్రవ్యాలు తీసుకొని చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని, మాదకద్రవ్యాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు ఎస్సై వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.