తిరుపతి పార్లమెంట్ టీడీపీ నాయకుల కీలక సమావేశం 

Jun 23, 2026 - 20:26
 0  2
తిరుపతి పార్లమెంట్ టీడీపీ నాయకుల కీలక సమావేశం 

శ్రీకాళహస్తి, జూన్ 23: (కను పాప తెలుగు దినపత్రిక )  తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లో విస్తృత ప్రచారం, రానున్న రాజకీయ కార్యాచరణపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమావేశం మంగళవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కుంచం దయాకర్, రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రీజనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి శంకర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు అండగా నిలవాలని నాయకులు సూచించారు.
అనంతరం తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత పటిష్టం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా, పార్టీ నాయకులు, హాజరయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333