తెలంగాణ కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కమిటీ ప్రకటన

Jun 24, 2026 - 00:05
Jun 24, 2026 - 00:30
 0  6
తెలంగాణ కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కమిటీ ప్రకటన

హైదరాబాద్,  24 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–  కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ల సమస్యలు, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై అత్యవసర రౌండ్ టేబుల్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహిచారు.  కేబుల్ టీవీ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ల ఐక్యత, హక్కుల సాధన మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం  తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ టీవీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, కేబుల్ టీవీ ఛానల్ యాజమాన్యాల హక్కుల పరిరక్షణ, కేబుల్ టీవీ ఓనర్లు మరియు చైర్మన్ల సమస్యల పరిష్కారం లక్ష్యంగా తెలంగాణ కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కమిటీని ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అద్యక్షులు బి.నరసింహ చారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ టీవీ ఓనర్లు, చైర్మన్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి హక్కుల సాధన కోసం సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కేబుల్ టీవీ రంగ అభివృద్ధి, ప్రభుత్వ ప్రకటనల కేటాయింపు, గుర్తింపు మరియు సంస్థాగత బలోపేతం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఐక్యతతోనే మన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని రాష్ట్ర అద్యక్షులు బి.నరసింహ చారి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ టీవీ నిర్వాహకుడు, సీఈఓ, జర్నలిస్టులు హాజరై సభ్యత్వం నమోదు చేసుకుని వారి  అభిప్రాయాలను వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలోని కేబుల్ టీవీ ఓనర్లు, చైర్మన్లు అందరూ ఐక్యంగా సంఘ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333