ఘోర రోడ్డు ప్రమాదం ....యువకుడు మృతి

May 24, 2026 - 12:41
 0  800
ఘోర రోడ్డు ప్రమాదం ....యువకుడు మృతి

  సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

మద్దిరాల వాసిగా గుర్తింపు... 

మృతదేహాన్ని తుంగతుర్తికి తరలింపు... 

అనాధలైన ఇద్దరు పిల్లలు... 

విషాద ఛాయలు అలుముకున్న  మద్దిరాల... 

అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) 24 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా జిల్లాలోని అర్వపల్లి మండలం పరిధిలో  ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మండలంలోని జాజిరెడ్డిగూడెం సమీపంలోని సీతారాంపురం వద్ద 365 హైవేపై వెళ్తున్న స్విఫ్ట్  AP 23 AJ 8439 VDI కారు ఎదురుగా వస్తున్న బొలోరో  TS 27 T 4779 వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మెడుదుల యాక స్వామి (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మద్దిరాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) ఉన్నారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు . . .. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి