ఘనంగా మట్టలా ఆదివారంర్యాలీ వేడుకలు

ఘనంగా మట్టలా ఆదివారంర్యాలీ వేడుకలు
తెలంగాణ వార్త వేములపల్లిఏప్రిల్ 13:- ప్రపంచ మానవాళి పాపపరిహారార్థం కోసం ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో తన రక్తాన్ని చిందించి తిరిగి మూడవరోజు పునరుద్దానుడైనాడని పాస్టర్ రెవ. కొమ్ము హోసన్నఅన్నారు ఆదివారం మండల కేంద్రంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలతో కలిసి సంఘ పెద్దలు, సంఘస్తులు ఈత మట్టలు చేత పట్టుకొని ఘనంగా ర్యాలీ నిర్వహించారుఈ సందర్భంగా పాస్టర్ హోసన్న మాట్లాడుతూ నాడు ఏసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయటానికి ముందుగా ఎరుషలేం పట్టణంలో ఆ ప్రాంత ప్రజలు గాడిదపై ఏసుక్రీస్తు వారు ఊరేగింపుగా బయలుదేరి వెళుచుండగా ఖర్జూరపు మట్టలతో జయ జయ ద్వానాలు చేయుచు ఊరేగింపుగా అందరూ కలిసి ఉత్సవాలు జరుపుకున్నారనిదానికి నిదర్శనంగా ప్రతి ఏటా ఈత మట్టలతో క్రైస్తవ సోదరులు ప్రభువును స్తుతిస్తూ ర్యాలీగా బయలుదేరి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ రావడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ పొరుగు వారిని ప్రేమించాలని ఒకరి పట్ల ఒకరు సహోదర భావం కలిగి ఉండాలని ఆయన అన్నారుకార్యక్రమంలో సెంటియాడి బాప్తి చర్చ్ సంఘ అధ్యక్షులు చెట్టిపల్లి శామ్యూల్ జాన్సన్, కార్యదర్శి దైద సాల్మన్ రాజ్, కోశాధికారి పుట్టల నతానియల్, ఉపాధ్యక్షులు పుట్టల జోసెఫ్ డేనియల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పుట్టల ఇమ్మానుయేల్, సండే స్కూల్ సూపరింటెండెంట్ పుట్టల విజయ ప్రేమ్ కుమార్, వైస్ సూపరిండెంట్ బొంగర్ల సమాధానం రాజ్, ఆడిటర్ అశోక్ కుమార్, సండే స్కూల్ టీచర్స్, సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.