ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

కార్యదర్శి షర్మిల పిస మొబిలైజర్ పద్మ

Nov 15, 2024 - 16:27
Nov 15, 2024 - 16:28
 0  2
ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

తెలంగాణ వార్త చుంచుపల్లి నవంబర్ 15 :- భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, గౌతమ్ పూర్ గ్రామపంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చుంచుపల్లి మండల ఎంపీ ఓ సత్యనారాయణ సూచనలతో  సెక్రటరీ షర్మిల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. సెక్రటరీ షర్మిల అధ్యక్షతన పీసా యాక్ట్ పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా పిసా మొబిలైజర్ పద్మ అమరజీవి ఆటవి జాతుల స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా బిర్సా  సాధించిన హక్కుల గురించి గ్రామ సభకు వచ్చిన వారికి వివరిస్తూ  బిర్సా ముండా (1875 -1900) బిర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు జానపద నాయకుడు ఇతడు ముండా జాతికి చెందినవాడు,19 వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో  జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు, 22 ఏళ్ల వయసు 1897 లోనే బ్రిటిష్ ర్ల పై యుద్ధం ప్రకటించాడు, తద్వారా భారత  స్వతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు, ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటు లోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది ఈ విధంగా సత్కరించబడిన ఏకైక  జాతుల నాయకుడు బిర్సా ముండా, బ్రిటిష్ వాళ్ళ సవాదులపై  తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతోప్రస్తావిస్తారు, పాతికేళ్లు కూడా నిండకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఇతని ఘనత మరింత ఉత్కృష్టమైనది, అనంతరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛమైన భారతదేశం కోసం గౌతమ్ పూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ షర్మిల ప్రతిజ్ఞ చేయడం జరిగినది. తధానంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివాసి బిడ్డలను సన్మానించడం జరిగింది . ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దొంతర బోయిన శ్రీనివాస్ తెలంగాణ క్రాంతి ఇబ్రహీం మాజీ వార్డు నెంబర్ కాంతమ్మ ఏ ఎన్ ఎం ఆశ వర్కర్లు అంగన్వాడీలు గ్రామ పెద్దలు , ఆశా వర్కర్ , పంచాయతీ వర్కర్స్  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333