ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన
అడ్డగూడూరు 21 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2010-11 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ ఒక్క దగ్గర కలవడంతో తమ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.