ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 2 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నందు చాగాపురం సర్పంచ్ Bసావిత్రమ్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఆమె జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి మరియు అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత కరెంటు, పాటు పలు పథకాలను విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని ఆమె కొనియాడారు, అలాగే రైతులకు కూరగాయల విత్తనాలను కూడా అందజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు గ్రామ తదితరులు పాల్గొన్నారు.