సూర్యాపేటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – సీనియర్ జర్నలిస్టు బంటు కృష్ణకు అక్రిడేషన్ కార్డు ప్రదానం
సూర్యాపేట, 3 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం జిల్లా యంత్రాంగం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కార్డులు, గుర్తింపు పత్రాలను అందజేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్టు, కవి, గోల్డ్ మెడలిస్టు, జిల్లా టియుడబ్ల్యూజే – ఐజెయు కార్యదర్శి, అక్రిడేషన్ కమిటీ మెంబర్ బంటు కృష్ణ*కు జిల్లా కలెక్టర్ *తేజస్ నంద లాల్ పవార్ అక్రిడేషన్ కార్డును అందజేశారు. మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డుల ప్రదానం ద్వారా వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ నరసింహ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొని అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ సాధనలో పాత్రికేయుల పాత్ర కీలకమని, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించడంలో మీడియా నిర్వహిస్తున్న బాధ్యతను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అన్నారు.