ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం

Sep 24, 2024 - 17:59
 0  1
ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం

 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల గద్వాల లో జాతీయ సేవా పథకం దినోత్సవం సెప్టెంబర్ 24 ను ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ జి కృష్ణ సార్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులలో విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసాన్ని, సమాజ సేవా దృక్పతాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని  సేవను ప్రజలలోకి తీసుకెళ్లి   మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో  పని చేయాలని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశం కోసం సేవా కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ (PO) పరంజ్యోతి మాట్లాడుతూ వాలంటీర్లు చదువుతో పాటు ప్రజలలోకి వెళ్లి పరిశుభ్రత,ప్లాస్టిక్ వినియోగం తగ్గిచడం మరియు బాల్య వివాహాలు, మూఢ నమ్మకలపై లైoగిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలని చాలన్నారు.   ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు స్వచ్ఛత హాయ్ సేవా (SHS) కార్యక్రమం మరియు ఎన్ ఎన్ ఎస్ వాలంటీర్లు పాత్ర అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ గారు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333