గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం.
తెలంగాణ వార్త 17 జనవరి :- మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ఆగామోత్కూర్ గ్రామానికి విచ్చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డికి సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు పతాని శ్రీను మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు,వయా ఆగామోత్కూర్ మీదుగా ఉదయం,సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలన్నారు,ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టి మరణించిన ఆగామోత్కుర్ గ్రామ పంచాయతీ వర్కర్ గంజి పాపయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు,గ్రామంలోని ప్రధానగా సీసీ కెమెరాలఏర్పాటు చేయాలని తెలిపారు.నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలన్నారు.నిర్మాణంలో ఉన్న పల్లె దావఖానాను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.ఆగామోత్కుర్ బొమ్మకల్ వాగుల మధ్యలో చెక్ డ్యాం నిర్మించాలన్నారు.భీమనపల్లి రోడ్ లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్లాట్లు గా మార్చి ఇండ్లు లేని పేదలకు పంచి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వినతి పత్రాన్ని పరిశీలించి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.