గ్రామ కమిటీలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మాడుగులపల్లి 17 జనవరి 20025 తెలంగాణవార్త రిపోర్టర్:- మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నిర్వహిస్తున్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని మిర్యాలగూడ నియోజవర్గ గ్రామాలలో పర్యటించి గ్రామాల్లో ప్రజలను నాయకులను కలిసి గ్రామ సమస్యలు తెలుసుకున్నారు అనంతరం గ్రామాలలోని సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అభివృద్ధి పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు అందించిన సంక్షేమ పథకాలతో పాటు జనవరి 26 నుంచి అమలు చేస్తున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజా పాలన ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను నిరుపేదలకు అసలైన లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంతోనే గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను మరల జరగకుండా ఉండాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి,తాజా మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు, యువ నాయకులు జిపిఆర్, బట్టు మాధవరెడ్డి, రామచంద్రారెడ్డి,చింతకాయల సతీష్,మండల యూత్ అధ్యక్షులు చింతకాయల సురేష్, భూపతి ఊషయ్య, ఆగం మోత్కూర్ గ్రామ శాఖ అధ్యక్షులు అందేం యాదయ్య, చిరుమర్తి గ్రామశాఖ అధ్యక్షులు పల్లోజు ప్రసాద్,సైదిరెడ్డి,మోహన్ రెడ్డి, చిట్యాల ఎల్లయ్య, బొడ్డు బాలకృష్ణ,మీనారెడ్డి, చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి,యూత్ ఒంటెపాక వినయ్, బొంగరాల నరేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.