గ్రామ పంచాయతీలు అభివృద్ధి రూ.9,968 కోట్ల నిధులు  కేటాయింపు

May 26, 2026 - 19:40
 0  1
గ్రామ పంచాయతీలు అభివృద్ధి రూ.9,968 కోట్ల నిధులు  కేటాయింపు

తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా మొత్తంలో నిధులను కేటాయించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అంటే సుమారు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను కేవలం మండల, జిల్లా ప్రజా పరిషత్‌, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మాత్రమే వాడాలని తెలిపింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, స్ట్రీట్‌ లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజలకు ఉపయోగపడే వాటికి మాత్రమే ఈ నిధులను వాడాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు వినిగించకూడదని తెలిపింది.అయితే ఈ నిధుల దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు తాము ఖర్చు చేసే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఏడాదిలో నిధులు దేనికి ఖర్చు చేవారో, చేసిన అభివృద్ధి ఏమిటి అనే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాని అందజేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వాటి సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. ఆడిట్‌లో లోపాలు, నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని.. ఈ మేరకు స్థానక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ఐదేళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక సంఘం రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. వీటిలో 80 శాతం నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించగా, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు అందజేయనున్నటు తెలిపింది. ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతల్లోఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.అయితే ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా మొత్తం నిధుల్లో 20 శాతం నిధుల విడుదలను కేంద్ర నిర్ణయిస్తుంది. 2026 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం నిధులు కేటాయించారు. అంటే తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92 శాతం, వైశాల్యానికి 0.37 శాతం చొప్పున మొత్తం రూ.9,968 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333