గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తా ధరావత్ రామోజీ

Dec 9, 2025 - 06:00
 0  148
గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తా ధరావత్ రామోజీ

   తిరుమలగిరి 09 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం కొట్యా నాయక్ తండా ఇస్లావత్ తండా గుల్ల బండ తండా లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ధరావత్ రామోజీ జోరుగా ప్రచారంలో ముందంజలో సాగుతున్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మూడు తండాలు కలిపి ఒక గ్రామం రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది గతంలో ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నారు కానీ అభివృద్ధి జరగలేదు కావున తండా ప్రజల తో మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించండి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో తండాలో సిసి రోడ్డు డ్రైనేజీ విద్యుత్ సమస్యలు వైకుంఠధామాలు ఇందిరమ్మ ఇల్లు బీటీ రోడ్డు వేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ధరావత్ నాగేంద్ర ధరావత్ యశోద ధరావత్ దేవా దాచేపల్లి శ్రీను అంజయ్య బిచ్చు బాలాజీ దేవేందర్ హైమావతి సునీత మంగమ్మ సేవ తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి