గ్రామాలలో రెచ్చిపోతున్నా శునకాలు
30-08-2024 తెలంగాణవార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలో శునకాల స్వైర విహారం. భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. చిన్నంబావి మండలం లోని కొప్పునూరు గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కుక్కల దాడికి వృద్ధులు,పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు శునకాలు బైకులపై రాత్రిపూట వెళ్లే సందర్భాలలో వెంబడిస్తున్నాయి అదేవిధంగా దేవుని ఆవు కు సంబంధించిన దూడను కూడా కుక్కలు చంపేయడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి కుక్కలకు వ్యాక్సిన్లు వేయించి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.