గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం
జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గట్టు మండలం బల్గేరా మరియు మాచర్ల గ్రామం నందు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా మండల స్పెషల్ ఆఫీసర్ డా, ప్రియాంక మరియు జిల్లా బాలల సంరక్షణ అధికారి నర్సింహులు హాజరు కావడం జరిగింది. వారు మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీ అనేది గ్రామా, మండల, జిల్లాలో కొంత మంది వ్యక్తులతో ఏర్పడే బృందం. బాలలపై ఏవిధమైన వేధింపులు, అకృత్యాలు, హింస జరగకుండా ఉండటంతో పాటు పిల్లలంతా ఆనందంగా ఉండేలా మార్చడం ఈ కమిటీ బాధ్యత. ఈ కమిటీ లు బాలల హక్కులను కాపాడడంలో, వారికీ ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో పని చేస్తాయి. బాలలంతా బడికి వెళ్లాలా చూడడం, బాలలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడడం, బాల్య వివాహాలను అరికట్టడం, పిల్లలు ఎలాంటి పనులకు వెళ్లకుండా చూడడంతో పాటు బాలల ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తాయి అని అన్నారు.బాల్యం పిల్లల హక్కు అని వారందరూ కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో పెరగాలన్నారు,మరియు బాల్య వివాహాలు, బాల కార్మికులు మరియు బాలల పై జరిగే శారీరక, మనషిక మరియు లైంగిక వేదింపులు నుండి రక్షణకై చైత్యనం అవ్వాలని మరియు ఇట్టి సమాచారాన్ని 1098 కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ సురేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాసంతి, పంచాయతీ కార్యదర్శి సురేష్, స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, దీనావతి, ఆర్డీఎస్ ఎన్జీఓ సభ్యులు ధనలక్ష్మి, ఎంవీ ఫౌండేషన్ సభ్యులు శృతి, నర్సన్న, మరియు అంగనివాడి టీచర్లు , ఆశ వర్కర్లు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు