గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదిలిన జూపల్లి అనుచరులు

Jun 28, 2025 - 21:14
 0  27
గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదిలిన జూపల్లి అనుచరులు

28-06-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు గోపాలదిన్నె రిజర్వాయర్ నుండి చిన్నంబావి మండలంలోని చివరి ఆయకట్టుకు నీళ్ళు వదిలిన మంత్రి జూపల్లి గారి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అధికారులు.

నేడు గోపాలదిన్నె రిజర్వాయర్ ఫుల్ నిండిన సందర్భంగా మేమంతా అధికారులను తీసుకొని అవుట్ఫాల్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఫుల్ లెవెల్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నందున రైతులకు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తూకాలుగాని ఖాళీగా ఉన్న చెరువులు గాని నింపుకోవడానికి వీలుగా ముందస్తుగానే నీటిని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నీరు చివరి ఆరికట్టుకు చేరడానికి ప్రతి రోజు అధికారులు మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని కోరడం జరిగింది అందుకు మేము కూడా మంత్రి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఎంత ఎవరు డిశ్చార్జ్ అయితుందో పరిశీలస్థం అన్నారు.రైతులు ఇబ్బంది పడకుండా నీటిని అందించవలసిందిగా అధికారులను కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి జూపల్లి గారి ప్రధాన అనుచరులు పెబ్బేటీ రామచంద్రారెడ్ది, ఇటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్, జంగ బిచుపల్లి యాదవ్ప,సుపుల రంజిత్ కుమార్, వడ్డేమాన్ బిచ్చన్న, DEE భవానభాస్కర్, AE జాషువా రిజర్వాయర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State