గోదావరి నదిహారతి నయనానందకరం
గోదావరి నది హారతిని కనులారా వీక్షించే భక్తులకు ఎన్నో పుణ్య ఫలాలు
భద్రాద్రి బ్రాహ్మణ పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్
తెలంగాణ వార్త సెప్టెంబర్ 6 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- శ్రావణ బహుళ దశమి ఆదివారం అత్యంత పుణ్యప్రదమైనదని, ఈరోజు లోక కళ్యాణార్ధం గోదావరి మాతకు సమర్పించే హారతులు సమస్త ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తాయని భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్ భక్తులకు తెలిపారు. ఆదివారం నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సంకల్పంతో ప్రతి ఆదివారం భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొని శ్రీరామా అనుగ్రహంతో గోదావరి మాత శుభాశీస్సులు పొందుతున్నారని అన్నారు.స్థానిక స్వచ్ఛంద సంస్థలు అధికారులు, గ్రామపంచాయతీ వారి సహకారంతో ప్రతి ఆదివారం గోదావరి హారతి నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ముందుగా గణపతి పూజ చేసి శ్రీ సీతరామచంద్రస్వామి వారికి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి, అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, గోదావరి మాతకు హారతులు సమర్పించిన అనంతరం రామా వజ్జల రవికుమార్ దంపతులు, పివీఎస్ ఎన్ రెడ్డి దంపతులు గోదావరి మాతకు ప్రసాదం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్ శర్మ, వీరభద్ర శర్మ, చంద్రశేఖర శర్మ, రామాచార్యులు, తే జాశర్మ, శివ, సత్యనారాయణ రెడ్డి, నరసింహ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.